ADB: జాతీయ లోక్ ఆదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం సీపీ శ్రీనివాస్ సూచించారు. రాజీమార్గం ద్వారా కేసులను అక్కడికక్కడే పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. లోక్అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 28న నిర్వహించే కార్యక్రమంలో క్రిమినల్ కాంపౌండ్ కేసులు, సివిల్ తగాదా కేసులు, కుటుంబ పరమైన, కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.