MNCL: పంచాయతీ కార్మికుల రక్షణ కోసమే లేబర్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నామని జన్నారం మండలంలోని పోన్కల్ ఈవో రాహుల్ అన్నారు. పోన్కల్ పంచాయతీ కార్మికులకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా శుక్రవారం లేబర్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యాలయాల్లో పని చేసే కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం అందుతుందన్నారు.