BHPL: మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మంథని రాజేందర్ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. అతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, వృద్ధులైన అమ్మానాన్న ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఛైర్మెన్ అయిలి మారుతి సోమవారం వారిని పరామర్శించి రూ.10 వేలు ఆర్ధిక సాయం చేశారు.