BDK: అశ్వాపురం మండలం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 1995-96 సం.కి చెందిన పూర్వ పదవ తరగతి విద్యార్థులు రైన్ కోట్స్ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన రైన్ కోట్లను సీఐ అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం పారిశుధ్యం పై సీఐ మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బందికి సహకరిస్తూ ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.