HYD: దేశ వ్యాప్తంగా సోమవారం బ్లాక్‌డేగా పాటించాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు TGSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ రోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. సోమవారం అన్ని ఆఫీసుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు.