ADB: భీంపూర్ మండల నూతన తహసీల్దార్‌ను మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అంశాలను తహసీల్దార్‌తో చర్చించారు. కార్యక్రమంలో మండల నాయకులు దాసరి రమేష్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, జలిగిరి మల్లేష్, రేణికుంట్ల శ్రీనివాస్, షైక్ అఫ్రోజ్ తదితరులు ఉన్నారు.