SRD: అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో ఈ నెల 25, 26న చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు పరీక్ష ఫీజుతోపాటు పదవ తరగతికి అదనంగా 500, ఇంటర్‌కు అదనంగా రూ.వెయ్యి చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవలో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు.