MBNR: 15వ వార్డు పరిధిలోని చిన్నదర్పల్లిలో కొంతకాలంగా రాత్రి వేళలో విద్యుత్ లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సమస్యను స్థానిక MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కౌన్సిలర్ లతశ్రీ లక్ష్మణ్ నాయక్ తీసుకెళ్లారు. స్పందించిన MLA, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ సహకారంతో మంగళవారం రాత్రి కొత్త ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. సమస్యలకు స్పందించి, సహకరించినందుకుగానూ స్థానిక ప్రజలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.