BDK: భద్రాచలం వద్ద గోదావరి నది శాంతించడంతో గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. స్నాన ఘట్టాల, ఆలయ పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల క్రితం వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో బురదమయంగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది ఆలయ సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తున్నారు.