MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారి ప్రధాన ఆలయం ఎదుట వరద ప్రవాహం తగ్గలేదు. శనివారం ఉదయం జోరుగా వరద ఉధృతి కొనసాగింది. ఈ రోజు కూడా ఆలయం తెరుచుకోలేదు. రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వరద ఉరకలు వేయడంతో ఐదు రోజుల నుండి దుర్గమ్మ ఆలయం దిగ్బంధమైంది. అటు వైపు భక్తులు వెళ్లకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు.