NRML: ఎఫ్ఏ-టు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ఏ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. విద్యార్థులు అందరూ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఇందులో ఉపాధ్యాయులు నాగభూషణ్ తదితరులు ఉన్నారు.