NRPT: ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సాహితీ కళావేదిక ప్రకటించింది. ఈ నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గం అమరచింత పట్టణానికి చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఫరీద్ ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఆదివారం ఫరీద్కు అవార్డును అందజేశారు.