Congress Foreman Committee Established Under Jana Reddy Leadership
Jana Reddy: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులపై క్లారిటీ రానుంది. గెలుపు అవకాశాలు, సర్వేను ప్రమాణికంగా చేసుకొని.. సామాజిక సమీకరణాల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుంది. టికెట్ రానీ వారు నిరుత్సాహ పడే అవకాశం ఉంది. లేదంటే ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉంది. సో.. అలా వీలు లేకుండా.. కాంగ్రెస్ పార్టీ ఫోర్ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ బాధ్యతలను సీనియర్ నేత జానారెడ్డికి (Jana Reddy) అప్పగించింది.
కమిటీ ఏం చేయాలంటే..?
కమిటీ ఏం చేయాలంటే.. సీట్ల ఎంపిక ప్రక్రియ సమయంలో… నేతల సూచన మేరకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎడ మొహం పెడ మొహంగా ఉండే నేతలను సమన్వయం చేయాలి. టికెట్ రానీ వారిని బుజ్జగించడం ప్రధాన విధి కానుంది. ఆ నేతలు బయటకు వెళితే.. పార్టీకి ప్రమాదం అని భావించి జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. కమిటీలో జనారెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ ఉన్నారు.
ఫోర్ మెన్ కమిటీ బుధవారం గాంధీ భవన్లో ఫస్ట్ మీటింగ్ నిర్వహించనుంది. ఇప్పటికే కమ్యూనిస్టులకు 4 సీట్లు కేటాయించగా.. రాష్ట్రంలో మిగిలిన 115 చోట్ల అసంతృప్తుల జాబితా తీస్తారు. నియోజకవర్గాల వారీగా రెబల్స్ ఎవరు తెలుసుకొని, చర్చిస్తారు. ఈ సారి టికెట్ రాదని, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరతారు.