»Iqoo Z7 Pro 5g India Launch When And Where To Watch Livestream And Everything To Know About Smartphone
iQOO Z7 Pro 5G: భారత మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే..!
భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్ 7 ప్రో 5జీ మూవీ ప్రవేశించింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్లో ప్రీమియం ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
iQOO Z7 Pro 5G India Launch: When And Where To Watch Livestream, And Everything To Know About Smartphone
iQOO Z7 Pro 5G: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడేవారే. ఈ రోజుల్లో ఫోన్ వాడని వారు, తెలియని వారు ఎవరూ ఉండటం లేదు. అందుకే ప్రజల వాడకాన్ని బట్టి, మార్కెట్లోకి నిత్యం ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అడుగుపెడుతూనే ఉంది. భారత మార్కెట్లోకి ఈ రోజు ఐక్యూఓఓ జెడ్7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ని ప్రవేశ పెట్టారు.
గతంలో ఐక్యూఓఓ జెడ్7 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. దానిలోని మరికొన్ని మార్పులు చేసి ఐక్యూఓఓ జెడ్7 ప్రోగా ఈ రోజు విడుదల చేశారు. దీని ఖరీదు రూ.25వేలుగా నిర్ణయించారు. ఈ ఫోన్ చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఈ ధరలో అన్ని మంచి ఫీచర్లు ఉండి, ఈ ధరలో ఇలాంటి ఫోన్ దొరకడం అరుదు అనే చెప్పొచ్చు.
హెచ్డీఆర్ 10 ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ప్రైమరీ కెమెరా 64ఎంపీ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7200ప్రాసెసర్‌తో వస్తోంది. 12జీబీ ర్యామ్, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుంది. ఇది వివో సబ్ బ్రాండ్‌గా మార్కెట్లోకి అడుగుపెడుతుంది.