బెంగుళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ ముందు భారత్ 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ జట్టు పేసర్ విలియమ్ ఒరౌర్కె కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం కోసం కష్టపడాల్సిందేనని అన్నారు. తాము ప్రపంచ స్థాయి జట్టుతో ఆడుతున్నామని, గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు. వర్షం పడకపోతే తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు.