భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. గతేడాది కెనడాలో జరిగిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ హత్య కేసును భారత్కు అంటగట్టే దుష్ట ప్రయత్నాల్లో కెనడా నిమగ్నమై ఉంది. ఈ తరుణంలో భారత్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ASYF సభ్యుడు సందీప్ సింగ్ సిద్ధూను పరారీలో ఉన్న ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది.