ఒకవైపు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. మరోవైపు ఆయన వారసుడు అఖిరా నందన్ కూడా బరిలోకి దిగుతున్నాడు. పవన్ ‘OG’ సినిమాతోనే అతడి ఎంట్రీ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో అఖిరా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా.. అఖిరా పవన్ యుక్త వయసు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే పవన్ అభిమానులకు పండగ అనే చెప్పొచ్చు.