AP: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. మూడు రోజులకే రూ.541 కోట్ల మేర మద్యం అమ్ముడుపోయింది. 7,943 మంది వ్యాపారులు మద్యం స్టాక్ తీసుకెళ్లారు. లక్షా 94 వేల 261 బీర్ల అమ్మకాలు జరిగాయి. 6 లక్షల 77 వేల 511 కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది. బార్లలోనూ రూ.78 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.