AP: విశాఖలోని ఆంధ్రా ఆస్పత్రి, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు చిన్నారులకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పీవీ రామారావు కోరారు. వివరాలకు 8886679733, 0891-2724777 నంబర్లను సంప్రదించాలన్నారు. ఇప్పటివరకు 4 వేల చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామని రామారావు పేర్కొన్నారు.