AP: కడప జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థినిపై జరిగిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి విఘ్నేశ్గా గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, నిందితుడి కోసం పోలీసు అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.