GNTR: పొన్నూరు పట్టణ ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు సిబ్బంది విధిగా పనిచేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు. పొన్నూరు పట్టణం నిడుబ్రోలులోని సమ్మర్ స్టోరేజ్ వద్ద నీటి మోటర్ల పనితీరు, సిబ్బంది హాజరు, పరిసరాలను శనివారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.