TG: పోలీసుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘పోలీసులు పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ప్రణాళిక రూపొందించాం. పోలీసు సిబ్బంది పిల్లల కోసం పాఠశాల నిర్మిస్తాం. గర్వంగా చెప్పుకునేలా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మిస్తాం. వచ్చే ఏడాది 1-5 తరగతులతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తాం. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు విద్యను కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.