సైనిక కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యం ఏఐకి ఉందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 62వ కాన్వొకేషన్ వేడకలో ఆయన మాట్లాడుతూ.. ఏఐతో గణనీయమైన మార్పులు వస్తాయని, అయితే ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాలని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయన్నారు.