అఖిల భారత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బీబీనగర్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. భువనగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో ప్లేట్ లెట్స్ తగ్గడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స కొరకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెకు సంబంధించిన బంధువులు బయట నిరీక్షిస్తుండగా హాలులో స్త్రీ పురుషుడు అర్ధనగ్న దుస్తులతో అసభ్యకరంగా ఉండటంతో ఒకరు వీడియో తీశారు. ఈ క్రమంలో సిబ్బంది వీడియో డిలీట్ చేయమని హెచ్చరించినట్లు సమాచారం.