MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ప్లాట్లుగా వేసి విక్రయించిన భూమిని,మళ్లీ వ్యవసాయ భూమిగా చూపించి రిజిష్టర్ చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్లాట్లు కొని మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలన్నారు.