TG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన శ్రీశైలం డ్యామ్ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ అధికారులు సాగర్ 18 గేట్ల ద్వారా 1,45,422 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1,72,312 క్యూసెక్కులు రాగా, అవుట్ ఫ్లో 1,89,312 క్యూసెక్కులు నమోదైంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.44 టీఎంసీలు ఉంది.