AP: రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. గుంటూరు-కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో నిలవనున్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ ఉండనున్నారు. ఈ మేరకు టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.