కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా కడప పర్యటనలో ఉన్న బుద్ధప్రసాద్ అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించారు. దర్గా పెద్దలు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. అమీన్ పీర్ మదార్ను దర్శించుకొని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.