AKP : స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. జిల్లాలో 15 నియోజకవర్గస్థాయి విజేతలు ఈ పోటీలలో పాల్గొన్నారు. పోటీలను జడ్పిటిసి సుకల రమణమ్మ ప్రారంభించారు. అనంతరం సాయంత్రం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.