తమ పార్టీ మాటల గారడీ పార్టీ కాదని తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ అన్నారు. ‘కర్తవ్యం, గౌరవం, క్రమశిక్షణ’ అనే సూత్రాన్ని పాటించాలని పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి మాత్రమే కొలమానాలు కాదని.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. కాగా, తమిళనాడులో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ పార్టీ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.