బీర్లు, స్పిరిట్లపై రేట్లు సవరించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. గతేడాది తగ్గించిన స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ని పెంచడంతో పాటు ధరలను పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1900 కోట్ల ఆదాయం వచ్చేలా మద్యం ధరలను సవరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రొహిబిషన్&ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కాగా, స్పిరిట్లపై రూ.20, బీర్లపై రూ.10 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.