మరాఠా వర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టిన మనోజ్ జరాంగే కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తాను అభ్యర్థులను బరిలోకి దించనన్నట్లు వెల్లడించారు. మరాఠా సామాజికవర్గం బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో మరాఠా ఉద్యమానికి అండగా ఉండే అభ్యర్థులకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.