AP: రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 23వ తేది నాటికి బంగాళాఖాతంలో తుఫాను వచ్చే సూచన ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 24,25 తేదీల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈదురు గాలులు వీస్తాయని.. 23వ తేదీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.