బాంబులు, రాకెట్లలో వాడే చాలా ముడి పదార్థాలను మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఫ్యాక్టరీలలో తయారు చేస్తుంటారు. ఈ కర్మాగారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో పనిచేస్తున్నవే. నాగ్‌పూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్స్ మార్కెట్‌ను ‘బాంబ్ బజార్’ అని పిలుస్తుంటారు. ఇక్కడ గడిచిన 90 రోజుల్లో రూ.900 కోట్ల విలువైన రాకెట్లు, బాంబులు, హెచ్ఎంఎక్స్, ఆర్డీఎక్స్‌లను పలు దేశాలకు అధికారికంగా విక్రయించారు.