GDWL: ఈ నెల 25, 26 న గద్వాల పట్టణం అనంత కన్వెన్షన్ హాల్లో సీపీఎం పార్టీ 3వ మహాసభలను జయప్రదం చేద్దామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం అయిజలో శాఖ మహాసభ నిర్వహించారు. గద్వాలలో జరిగే సభకు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ, సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ తదితరులు హాజరవుతారని తెలిపారు.