కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆదివారం పెదపారుపూడి మండలం యలమర్రులో పర్యటించారు. గ్రామంలోని బిలీవర్స్ చర్చ్ నిర్వాహకులు నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని ఆయన సంఘస్తులతో కలసి ప్రారంభించారు. అనంతరం జరిగిన ఆదివారం ప్రార్థనలలో వర్ల పాల్గొన్నారు. పామర్రు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.