బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఓటీటీ వేదిక అయిన ‘ఆహా’లో ప్రసారం అయ్యే టాక్ షో ‘అన్‌స్టాపబుల్-4’ సీజన్ మొదటి ఎపిసోడ్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు షూటింగ్ కోసం చంద్రబాబు సెట్స్‌కు వచ్చారు. దీంతో సీఎంకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. కాగా అన్‌స్టాపబుల్ షోలో ఇదివరకు చంద్రబాబు, తన కుమారుడు లోకేష్‌తో కలిసి వచ్చిన ఎపిసోడ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.