ప్రకాశం: పుల్లలచెరువు మండలంలో మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రానికి వాన కురవడంతో రైతులు అల్లాడుతున్నారు. వాన తగ్గింది కదా అని, పంటలకు మందు చల్లుకుందాం అనుకునే లోపే వాన తీవ్రత ఎక్కువైపోతోంది. వాన తీవ్రత వల్ల పంట పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.