SKLM: పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఎల్.ఎన్.పేట వైస్ ఎంపీపీ తలసముద్రం కుమారి అన్నారు. ఎల్.ఎన్.పేట మండలంలోని కవిటి గ్రామంలో ఆదివారం పారిశుద్ధ్య పనులను చేపట్టారు. డ్రైనేజీలో పూడికలు తొలగించి గ్రామానికి దూరంగా తరలించామని అన్నారు. ఎల్.ఎన్.పేట ఎంపీడీవో పి శ్రీనివాసరావు సూచనల మేరకు డ్రైనేజీలో పూడికలు తొలగించామన్నారు.