ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సైన్యం ప్లాన్ చేస్తున్నట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన పాత్రలు లీక్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపాయి.