బెంగళూరులో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టులో ఐదవ రోజు ఆట ప్రారంభం అయింది. NZ రెండవ ఇన్నింగ్స్లో నిన్న 4 బంతులు ఆడిన అనంతరం వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. ఇవాళ వర్షం తగ్గడంతో ఆట ప్రారంభించారు. న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి సున్నా పరుగులు చేసింది. క్రీజ్లో యంగ్, కాన్వే ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే వెంట వెంటనే వికెట్లు తీయాల్సిందే.