TG: వాహనదారులకు రవాణా శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. కొందరు TSతో ఉన్న అక్షరాలను తొలగించి TGగా మార్చేస్తున్నారన్నారు. TG సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే ఈ కోడ్ వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా సొంతంగా TS నంబర్ ప్లేట్‌పై TGగా మారిస్తే ట్యాంపరింగ్‌గా భావిస్తామని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.