TG: నాగర్ కర్నూల్ జిల్లా రంగపూర్ గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవరెడ్డి ఆలయ అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆలయం దిగువన ఉన్న పంచలింగాల వద్ద నూతన హంగులతో కళ్యాణ మండపం ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారని ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని ఛైర్మన్ శాలువాతో సన్మానించారు.