ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసింది. రిటెన్షన్ జాబితాలో ప్రథమ ఎంపికగా రిషభ్ పంత్, అలాగే.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను రిటైన్ చేసుకోవాలని DC భావిస్తోంది.