చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో శుభ్ మన్ గిల్.. సిక్సర్లలో కోహ్లీ రికార్డును సమం చేశాడు. టెస్టు ఫార్మాట్లో గిల్, కోహ్లి 26 సిక్సర్లు బాదారు. అయితే గిల్ 26 టెస్టుల్లో, కోహ్లీ 114 టెస్టుల్లో ఈ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (84), ధోని(78), సచిన్ టెండూల్కర్(69) ఉన్నారు. గిల్, కోహ్లీ వరుసగా 15,16 స్థానాల్లో ఉన్నారు.