భారత యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన ప్రతిభతో తనకే కాకుండా యావత్ దేశానికి ప్రశంసలు తెచ్చుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలిచిన తర్వాత, అతని అభిమానుల ఫాలోయింగ్ నిరంతరం పెరిగింది.
భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. గాయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ కోలుకున్నాడు.
ఐసీసీ ట్రోపీ గెలిస్తేనే అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణిస్తారని.. రోహిత్ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ అన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయం దీనికి ప్రామాణికం కాదన్నారు.
ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో భారత జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సత్తా చాటాడు. స్వర్ణ పతకం సాధించి భారత కీర్తిని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. అతన్ని యావత్ భారతం అభినందలతో ముంచెత్తుతోంది.
ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఈ నెల చివరి నుంచి టోర్నీ మొదలు కానుంది. వచ్చే నెల 2వ తేదిన భారత్, పాక్ దేశాలు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో దాయాది జట్ల మ్యాచ్‌పై సర్వత్రా చర్చ మొదలైంది.
లా లిగా 2023 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులో సెల్టా విగో క్లబ్‌పై రియల్ మాడ్రిడ్(real madrid) క్లబ్ జట్టు గెలుపొందింది. 80 నిమిషాల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో రియల్ మాడ్రిడ్ ఆటగాడు జూడ్ బెల్లింగ్‌హామ్ గోల్ చేసి జట్టును గెలిపించాడు.
ఒలింపిక్స్ విజేత, భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
ఐర్లాండ్ తో జరిగిన టీమిండియా(india vs ireland) సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ లు భారత్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ తో క్లీన్ స్వీప్ చేయాలని అనుకున్నారు. కానీ, మూడో మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది.
ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు తుది ఎంపిక జరిగింది. ఇందులో ఆల్ రౌండన్ హర్ధిక్ పాండ్యకు బ్యాక్ అప్‌గా శార్దుల్ ఠాకూర్ బదులు శివమ్ దూబెను తీసుకుంటే బాగుండేదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించగా.. జట్టులో మార్పులు అవసరం లేదని సునీల్ జోషి స్పందించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా రద్దు చేసింది.