»Sunil Gavaskar Picks This Team As His Favorite To Lift Odi World Cup
Sunil Gavaskar: వన్డే వరల్డ్ కప్ ఆ జట్టు గెలుస్తోంది: సన్నీ, ఇర్ఫాన్ మాత్రం
ఈ సారి ప్రపంచ కప్‌ను ఇంగ్లాండ్ గెలుస్తోందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆ జట్టు అన్నీ విభాగాల్లో బాగుందని.. ముగ్గురు ఆల్ రౌండర్లు ఉండటం ఆ టీమ్‌కు కలిసి వస్తోందని అంచనా వేశారు.
Sunil Gavaskar Picks This Team As His Favorite To Lift ODI World Cup
Sunil Gavaskar: వన్డే వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. జట్ట బలబలాలు, గెలుపు ఓటములు, ట్రోఫీ ఎవరూ గెలుస్తారనే చర్చ జరుగుతుంది. అక్టోబర్ 5వ తేదీన 2018 ఫైనలిస్టులు ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ సంరంభం ప్రారంభం కానుంది. ఈ సారి టైటిల్ ఎవరు కొడతారో చెప్పారు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar).
ఈ సారి ఫేవరెట్ టీమిండియా కాదని బాంబ్ పేల్చాడు సన్నీ.. అలాగనీ పాకిస్థాన్ కూడా కాదన్నారు. లాస్ట్ కప్ కొట్టిన ఇంగ్లాండ్ మళ్లీ కప్‌ను ముద్దాడుతోందని చెప్పారు. బ్రిటిష్ జట్టే ఎందుకు కప్ కొడుతుందని అంటే ఇలా వివరించాడు. ఆ జట్టులో ముగ్గురు ప్రపంచస్థాయి ఆల్ రౌండర్లు ఉన్నారని చెబుతున్నారు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉందన్నారు. ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్ స్థితిని మార్చేయగలరని పేర్కొన్నారు. అందుకే తన ఫేవరెట్ ఇంగ్లాండ్ అంటున్నారు. సునీల్ కామెంట్స్ ఇలా ఉండగా.. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భారత్ ఫేవరెట్ అని.. కప్ కొడుతోందని ధీమాతో ఉన్నారు.
వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన చూడాలని ఆసక్తితో ఉన్నానని ఇర్ఫాన్ పఠాన్ (Pathan) చెబుతున్నారు. వరల్డ్ కప్ ఫేవరెట్లలో టీమిండియా కూడా ఉందన్నారు. ఆసియా కప్, ఇతర సిరీస్‌లలో అద్భుతమైన ప్రదర్శనను ప్లేయర్స్ కనబరిచారని తెలిపారు. సొంత గడ్డపై ఆసీస్‌తో సిరీస్ గెలిచి.. ఆత్మవిశ్వాసంతో ఉన్నారని వివరించారు. టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉందని.. షమీ వంటి ఉత్తమ పేస్ బౌలర్ భారత పిచ్‌లపై రాణిస్తాడని గుర్తుచేశారు. ఆసీస్‌తో సిరీస్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యాయని.. రిజర్వ్ బెంచ్ కూడా పటిష్టంగా ఉందనే విషయం ప్రత్యర్థులకు కూడా అర్థమయ్యిందని తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఆసీస్‌తో సిరీస్‌లో లాస్ట్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.