»Odi World Cup2023 India And Bangladesh Are Facing Each Other In Pune What Is Indias Target
IND vs BAN: ఇండియా టార్గెట్ ఎంతంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రోజు పూణే వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ జట్లు పోటీపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. భారత్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంది. నిర్ణీత ఓవర్లు ఆడి 256 పరుగులు చేసింది.
ODI World Cup2023, India and Bangladesh are facing each other in Pune. What is India's target?
IND vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో నేడు భారత్(bharat), బంగ్లాదేశ్(bangladesh) జట్ల మధ్య 17వ మ్యాచ్ పూణెలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 256 పరుగులు చేసింది. మరోవైపు గాయం కారణంగా కెప్టెన్ షకీబ్ వారి జట్టు నుంచి తప్పుకున్నాడు. శాంటో జట్టుకు నాయకత్వం వహించాడు. హ్యాట్రిక్ విజయాలతో కొనసాగుతున్న టీమ్ఇండియా ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నాల్గవ గేమ్‌లో భారత్ తలపడుతుంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ ను గెలవాలని ఆట ఆరంభం నుంచే కలిసిగా ఆడింది. ఫలితంగా 257 పరుగులను భారత్‌కు టార్గెట్‌గా ఇచ్చింది.
ఓపనెర్ తాంజిద్ హసన్ 43 బంతుల్లో 51 పరుగులు చేసి భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విసిరిన బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఇది భారత్‌కు మొదటి వికెట్. 82 బంతులు ఆడి 66 పరుగులు చేసి లిటోన్ దాస్ క్యాచ్ అవుట్ అయ్యాడు. వీరిద్దరు బంగ్లాకు చేరో అర్ధశతకం బాదీ మంచి స్కోర్‌ను అందించారు. విజృంభించిన భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా.. సిరాజ్, జడేజా చేరో రెండు వికెట్లను తీసుకున్నారు. అలాగే శర్థుల్ ఠాగుర్, కుల్దీప్ యాదవ్ ఒక్కోక్క వికెట్లు తీశారు. మొత్తంగా భారత బౌలర్లు 6 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు.