»Motogp Apologizes After Distorted Map Of India Fuels Controversy
MotoGP : భారత్ మ్యాప్ ను తప్పుగా చూపినందుకు క్షమాపణలు చెప్పిన మోటో జీపీ
మొదటి రోజు ప్రాక్టీస్ సెషన్లో లైవ్ స్ట్రీమింగ్‌లో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపడంతో MotoGP వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ మినహా భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలన్నీ మ్యాప్ లో తప్పుగా ప్రదర్శితమయ్యాయి.
MotoGP : మొదటి రోజు ప్రాక్టీస్ సెషన్లో లైవ్ స్ట్రీమింగ్‌లో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపడంతో MotoGP వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ మినహా భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలన్నీ మ్యాప్ లో తప్పుగా ప్రదర్శితమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగడంతో మోటోజీపీ ఓ ప్రకటన విడుదల చేసి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో చాలా మంది 1991 నుండి FIM వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్ హక్కులను కలిగి ఉన్న MotoGP, Dorna Sports రెండింటినీ ట్యాగ్ చేశారు.
ఈ విషయంపై చాలా మంది వినియోగదారులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని ట్యాగ్ కూడా చేశారు. విషయం తీవ్రతను అర్థం చేసుకున్న మోటోజీపీ వెంటనే క్షమాపణలు చెప్పింది. ప్రసారంలో భాగంగా ముందుగా చూపిన మ్యాప్ తప్పుగా చూపినందుకు భారతీయులకు క్షమాపణ అడుగుతున్నట్లు MotoGP పేర్కొంది. ఇంకా మోటోజీపీ విడుదల ప్రకటనలో.. మీతో కలిసి భారతదేశ గ్రాండ్ ప్రిక్స్‌ను ఆస్వాదించగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో మొదటి రేసును నిజంగా ఆస్వాదిస్తున్నాము. దీని తరువాత, MotoGP ఇండియా దేశం మ్యాప్‌ను మెరుగుపరిచింది. సెప్టెంబరు 22 నుంచి అంటే నేటి నుంచి సెప్టెంబర్ 24 వరకు మోటోజీపీ రేస్ జరగనుంది.
FIM వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్ దీర్ఘకాల హక్కులను కలిగి ఉన్న డోర్నా స్పోర్ట్స్, ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ సహకారంతో ఈ ఈవెంట్ సాధ్యమైంది. ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ 2023 నుండి 2029 వరకు భారతదేశంలో MotoGP రేసులను నిర్వహించే హక్కులను కలిగి ఉంది. ఇది దేశ మోటార్‌స్పోర్ట్స్ చరిత్రలో కొత్త శకానికి నాందిగా పరిగణించబడుతోంది.