బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(140) బాదడంతో భారత్‌పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్‌పై 43 ఇన్నింగ్స్‌లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.